Home Page SliderTelangana

గ్రాట్యుటీ పొందడం ఉద్యోగి హక్కు: హైకోర్టు

టిజి: రిటైర్మెంట్ తర్వాత గ్రాట్యుటీ పొందడం ఉద్యోగి హక్కు అని హైకోర్టు స్పష్టం చేసింది. అది యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పేర్కొంది. ఉద్యోగి లేదా వారసులకు గ్రాట్యుటీ ఇవ్వాలని చట్టంలో ఉందని తేల్చి చెప్పింది. రూ.3.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెరిగిన గ్రాట్యుటీ సీలింగ్‌కు ఉద్యోగులు అర్హులంటూ పిఎఫ్ అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇసిఐఎల్ దాఖలు చేసిన అప్పీళ్లపై కోర్టు ఇలా స్పందించింది.