Home Page SliderTelangana

చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జా విషయంలో ఎవరినీ ఉపేక్షించబోనన్న రేవంత్

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముందడుగు పడింది కాంగ్రెస్ హయాంలోనేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రాంత సమస్యలన్నింటిపై నాకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ఉప్పల్​ నల్లచెరువు సీవేజీ ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు… ఆ తరువాత అభివృద్ధిపైనే మా దృష్టి అన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యమన్నారు. వచ్చే 25 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లనున్నామన్నారు. వేగంగా సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామన్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాల కబ్జా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. దీనిపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాన్నారు రేవంత్. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటామన్నారు.