Home Page SliderTelangana

రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారు:నాగం

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలన్ని అభ్యర్థుల ప్రకటన,ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాయి. కాగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ పార్టీ తాజాగా అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ టికెట్లు కేటాయించే విషయంలో సొంత పార్టీ అభ్యర్థులే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారికి కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే రేవంత్ రెడ్డి టికెట్లు ఇస్తున్నారని ఆ పార్టీ నేత నాగం జనార్థన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారన్నారు. కాగా రేవంత్ పార్టీలో ప్యారాచూట్ నాయకులకు మాత్రమే టికెట్ కేటాయిస్తున్నారన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన నాయకులకు రేవంత్ రెడ్డి అన్యాయం చేసి..వాళ్ల బతుకులను ఆగం చేశారని నాగం జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.