Andhra PradeshNews Alert

ఈకష్టం మరెవరికీ వద్దని మామ కోసం అల్లుడు చేసిన పని

Share with

రోడ్డు ప్రమాదాలలో  సొంతవారిని కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. అప్పటివరకూ వారితో కలిసి,మెలసి మసలినవారు అలా బయటకు వెళ్లి విగతజీవిగా తిరిగిరావడం ఎంతో భరించలేని బాధను కలుగజేస్తుంది. ఆక్సిడెంట్ల వల్ల పోయే ప్రాణాలు కొన్నయితే, రోడ్ల గుంతలు, గతుకుల కారణంగా జరిగే ప్రమాదాలు కొంతైనా తగ్గిస్తే కొన్ని ప్రాణాలు నిలబడతాయి. సరిగ్గా ఇలాగే ఆలోచించారు విశాఖపట్నానికి చెందిన రవ్వా సుబ్బారావు బంధువులు. సుబ్బారావు ఈనెల 4న స్కూటర్‌పై విశాఖపట్నం డీఆర్‌ఎం కార్యాలయం నుండి రైల్వే స్టేషన్‌కు వెళ్తూ రహదారి మధ్యలో ఉన్న గుంత వల్ల కిందపడిపోయాడు.  తలకు  తీవ్ర గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6వ తేదీన మరణించారు. అదే గుంత వల్ల మరో  వ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. దీనితో విషయం తెలుసుకున్న సుబ్బారావు అల్లుడు వెంకటరావు బాగా చలించిపోయాడు. తమ కుటుంబం పడిన బాధలు మరెవ్వరూ పడకూడదని, మానవత్వంతో స్పందించి, తన సొంత ఖర్చులతో సిమెంటు, ఇసుక, కంకర తెచ్చి స్వయంగా ఆ గుంతను పూడ్చి పెట్టారు. అధికారులే చూసుకుంటారులే మనకెందుకులే అని పట్టించుకోకుండా ఆ గుంతను వదిలేస్తే మరెందరో దాని వల్ల గాయాల పాలయ్యే ప్రమాదం ఉంది. ఇలా బాద్యత వహించి గుంతను పూడ్చిన వెంకటరావు ఎంతైనా అభినందనీయుడు కదూ..