రేవంత్‌కు కరోనా…! పాదయాత్రకు దూరం
దేశంలో మళ్లీ కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. రెండు డోసుల టీకా తీసుకున్న వారికీ కూడా కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం రాజకీయ నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు. రేవంత్ రెడ్డికి కరోనా సోకడం ఇది రెండోసారి. గత ఏడాది మార్చిలోను ఆయన కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శనివారం మొదలుపెట్టిన పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరమయ్యారు. ఈ యాత్ర ఏడు గ్రామాల మీదుగా 15 కిలో మీటర్ల వరకు సాగేలా ప్లాన్ చేశారు. చౌటుప్పల్, నారాయణపూర్‌లో పాదయాత్ర సాగనుంది. ఇందులో జానారెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క, దామోదర్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్లు కూడా పాదయాత్రలో పాల్గొననున్నారు.