NewsTelangana

రేవంత్ ఆరోపణలు రుజువు చేయ్… రాజగోపాల్ సవాల్

Share with

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా అంటూ స్పష్టం చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తిట్టలేదన్న రాజగోపాల్ రెడ్డి… ఇవాళ ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఖతం అయ్యిందని రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు. పైసలు పెట్టి పీసీసీ తెచ్చుకున్నావని విమర్శించారు. టీడీపీ నుండి కాంగ్రెస్‌లోకి వచ్చే ముందు రాజీనామా చేసావా అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ ఇస్తే సరిపోతుందా అని దుయ్యబట్టారు.

సోనియాను బలి దేవత అన్న నువ్వో బ్లాక్ మేలరవంటూ నిప్పులు చెరిగారు. జైలుకు ఎందుకు పోయావో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి ఒక దొంగని… బ్లాక్ మేయిలరని… చరిత్ర హీనవుడవని ఆక్షేపించారు. ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం సర్ ను తిట్టావంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. వైఎస్ చనిపోతే కూడా తిట్టారన్నారు. కాంగ్రెస్‌ను, రాహుల్‌ను, సోనియా గాంధీని తిట్టకూడని తిట్లు తిట్టాడన్నారు. మహబూబ్ నగర్ ఎంపీ‌కి పోటీ చేయకుండా మల్కాజగిరి ఎంపీ గా పోటీ చేశార్నారు. టీడీపీతో పొత్తుపెట్టుకొని గెలిచాడని విమర్శించారు. రేవంత్ తీరుతో కాంగ్రెస్‌లో ఎవరు సంతోషంగా లేరన్నారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్న రాజగోపాల్ రెడ్డి… దిష్టి బొమ్మలు తగలబెట్టాలని చెప్పిన వాళ్లు ఎమ్మెల్యే గెలిచారా అని ప్రశ్నించారు. సంబరాలు చేసినవారికి మొన్న హుజురాబాద్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయో గుర్తుంచుకోవాలన్నారు. మునుగోడు ప్రజలే రేవంత్‌కు బుద్ది చెబుతారన్నారు. Ghmc ఎన్నికల్లో కూడా రేవంత్ ఎవ్వర్నీ గెలిపించలేదన్నారు. నాకు టెండర్ వచ్చిందని అందుకే బీజేపీకి పోతున్నానంటున్నారని… చెప్పడం దారుణమన్నారు. బీజేపీ ద్వారా ఒక్క రూపాయి లబ్దిపొందినట్టు రుజువు చేసినా రాజకీయాలు మానేస్తానన్నారు. రేవంత్ ఓ చిల్లర దొంగ అంటూ దుయ్యబట్టారు. సీఎం అయ్యి రాష్ట్రాన్ని రేవంత్ అమ్ముకోవాలని చూస్తున్నాడన్నారు. రేవంత్ వెనుక బాబు, సీమాంధ్రులు ఉన్నారన్న రాజగోపాల్ రెడ్డి… చంద్రబాబు హైదరాబాద్‌ను తన గుపెట్లో పెట్టుకోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ పీసీసీ అయ్యాక అందర్నీ బెదిరించి పైసలు వసూల్ చేస్తున్నాడన్నారు.