InternationalNewsNews Alert

వెస్టిండీస్‌పై సూర్యప్రతాపం

Share with

భారత, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ-20 సిరీస్‌లో భారత్ మరో విజయాన్ని నమోదు చేసింది.  బస్సెటెర్రె వేదికగా జరిగిన ఈ మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. 5 వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లను సాధించగా పాండ్య, అర్షదీప్ చెరో వికెట్ తీసారు. విండీస్ ఓపెనర్స్ మేయర్స్ 53 బంతుల్లో 73 పరుగులు సాధించగా, బ్రాండన్ కింగ్ 20, నికోలస్ పూరన్ 22 పరుగులతో పర్వాలేదనిపించారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడటంతో సునాయాసంగా విజయం సాధించింది. సూర్యకుమార్  8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు చేసాడు. కెప్టెన్ రోహిత్‌శర్మ దూకుడుగా ఆడినప్పటికీ 1.4 వద్ద ఔట్ అయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 27 బంతుల్లో 24 పరుగులు సాధించి సూర్యకుమార్‌కు అండగా నిలిచాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్‌ను పరుగుపెట్టించారు. మ్యాచ్ ఆఖరుకి వచ్చేటప్పటికీ దీపక్ హుడాతో కలిసి రిషబ్ పంత్ 33 పరుగులు తీయడంతో 6 బంతులు మిగిలి ఉండగానే  7 వికెట్ల తేడాతో భారత్ విజయఢంకా మోగించింది.