రేపు కృష్ణ అంత్యక్రియలు
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో లేదా ఆయన ఫాంహౌస్‌లో జరగనున్నాయి. ఆయన పార్థివ దేహాన్ని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి నానక్‌రామ్‌గూడలోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన భౌతికకాయాన్ని సినీ ప్రముఖుల సందర్శనార్థం సాయంత్రం 4 గంటల వరకు ఇంటి వద్ద 4 గంటల వరకు ఉంచుతారు. తర్వాత గచ్చిబౌలి స్టేడియానికి తరలించి.. సాయంత్రం 5 గంటల నుంచి ఆయన అభిమానుల సందర్శనానికి అవకాశం కల్పిస్తారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను కృష్ణ కుటుంబ సభ్యులు, పోలీసులు పరిశీలించారు. అక్కడి నుంచి సినీ, ఇతర ప్రముఖులు నివాళి అర్పించేందుకు పద్మాలయా స్టూడియోలోనూ కొంతసేపు భౌతికకాయాన్ని ఉంచుతారు. కృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.