ప్రగతి భవన్ ఇనుప కంచెల తొలగింపు
హైదరాబాద్ ప్రగతిభవన్ గేట్లను విరగ్గొడుతున్నారు. ఇన్నాళ్లు ప్రగతి భవన్‌గా పేరుగాంచిన దీనిని ఇకపై ప్రజాభవన్‌గా మార్చనున్నామని కాంగ్రెస్ పార్టీ అభిజ్ఞవర్గాల భోగట్టా. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తామని కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో.. ప్రగతి భవన్ వద్దనున్న కంచెలను పోలీసులు తొలగిస్తున్నారు. ప్రజాదర్బార్ కోసం క్యూలైన్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కంచెల కారణంగా రోడ్డుపై నడిచే పాదచారులు, వాహనదారులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారని విమర్శలొచ్చాయి.

