అధిక ధరల నుండి వంటనూనెల వినియోగదారులకు ఊరట.. అదానీ విల్మర్

ఫార్చూన్ బ్రాండ్ పేరుతో వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్ కంపెనీ వంట నూనెలపై వినియోగదారులకు అధిక ధరల నుండి ఊరట కల్పించింది.అంతర్జాతీయంగా తగ్గిన ధరల నేపథ్యంలో వంట నూనెల ధరలను రూ.30/- వరకు తగ్గిస్తున్నట్లు ఆ కంపెనీ సోమవారం ప్రకటించింది.దీంతో ఆ కంపెనీ సోయాబీన్ ఆయిల్ ధరలు బాగా తగ్గాయి.అయితే తగ్గిన ధరలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేయాలని కేంద్రం కొన్ని కంపెనీలకు సూచించింది.దీంతో ధరలు తగ్గిస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.అయితే తగ్గించిన ధరలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థఎండీ,సిఈఓ అంగ్షు మల్లిక్ పెర్కొన్నారు.రాబోయే పండగ సీజన్ లో డిమాండ్ పెరుగుదలకు ఈ ధరల తగ్గింపు ఊతమిస్తుందన్నారు.అదానీ విల్మర్ బ్రాండ్ పేరిట వంటనూనెలతో పాటు బియ్యం ,గోధుమ పిండి,చక్కెర,శనగ పిండి వంటి వాటని కూడా విక్రయిస్తున్నట్లు తెలిపారు.