National

ఆయన అనుభవంతో దేశానికి ఎంతో మేలు..

Share with

         

పార్లమెంట్ వర్షాకాల  సమావేశాలకు రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరిసారిగా వెంకయ్యనాయుడు నేతృత్వం వహించారు. ఆదివారం  సాయంత్రం జరిగిన 41 మంది పార్టీ నేతలు , కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. పదవీకాలం పూర్తి కానున్న సందర్భంగా ఆయన గవర్నర్లకు విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా , ఉపరాష్ట్రపతి అభ్యర్ధి జగదీప్ ధన్‌ఖడ్ కూడా హాజరయ్యారు. సోమవారం జరగనున్న ఎన్నికలు సజవుగా జరిపించడమే నా పదవీ విరమణకు మీరిచ్చే బహుమతని చెప్తూ  భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి ఒక్కరూ సభ గౌరవం నిలబెట్టేందుకు కృషిచేయాలన్నారు. వెంకయ్య సభని నిర్వహించిన విధానాలను రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షనేత మల్లికార్ఖున ఖర్గేలతో సహా ఇతర పార్టీల నేతలు జైరాం రమేశ్ , విజయసాయి రెడ్డి , కె. కేశవరావు   ప్రశంసించారు.