జనసేన కార్యకర్తలకు కోర్టులో ఊరట
జనసేన కార్యకర్తలకు కోర్టులో ఊరట లభించింది. ఎయిర్ పోర్టు వద్ద మంత్రులపై దాడి కేసులో నిందితులు 61 మందిని పది వేల పూచీకత్తుపై విడుదలకు కోర్టు అనుమతిచ్చింది. మిగతా 9 మందికి మాత్రం ఈనెల 28 వరకు రిమాండ్ విధించింది. 9 మందిపై 307 సెక్షన్ తొలగించి 326 సెక్షన్ గా మార్చి రిమాండ్ విధించాలని కోర్టు ఆదేశించింది. హైడ్రామా మధ్య జనసేన నేతలను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. వైసీపీ మంత్రులు తిరిగి వెళ్తున్న సందర్భంగా దాడి ఘటనలో మొత్తం 92 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో మొత్తం 70 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు.

