ఈ బడ్జెట్‌లో వేతన జీవులకి ఊరట
ఫిబ్రవరి1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో ఈసారి వేతన జీవులకు ఊరట లభించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షికాదాయం రూ.10 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే రూ.15 లక్షల నుండి రూ.20 లక్షల వరకూ కొత్తగా 25 శాతం పన్ను శ్లాబ్‌ను తేవాలని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.15 లక్షల పైబడిన ఆదాయానికి కూడా 30 శాతం పన్ను విధిస్తున్నారు.

