రిలయన్స్ స్మార్ట్ లో ఎక్స్ పైరీ ప్రొడక్ట్స్..
రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీత మెడోస్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో ఎక్స్ పైరీ ప్రొడక్ట్ లను యాజమాన్యం కస్టమర్లకు అమ్ముతున్నారు. అడిగితే ఏం చేస్తారో చేసుకోండి అని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది మాజీ మేయర్ భర్త చిగిరింత నరసింహారెడ్డి కి చెందిందని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏది ఏమైనా ఎక్స్ పైరి ప్రొడక్ట్స్ ను అమ్ముతున్న రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఫై చర్యలు తీసుకోవాలని కస్టమర్లు కోరుతున్నారు.

