Andhra PradeshNews

రాజకీయాలకు అతీతంగా సంబంధాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయ్. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ చల్లని దీవెనలు కావాలన్నారు జగన్. కేంద్రం, ప్రత్యేకంగా మీరు… ఏపీ కోసం, ప్రజల కోసం చేసే ఏ మంచైనా, ఈ రాష్ట్రం, ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో, ప్రత్యేకంగా మీతో.. మా అనుబంధం.. పార్టీలకు రాజకీయాలకు అతీతమన్నారు. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరొక అజెండా లేదు. ఉండదు.. ఉండబోదన్నారు. ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలంటూ మోదీని జగన్ని ఆకాశానికెత్తేశారు.