దొంగ ఓట్ల నమోదు తెలుగుదేశం పార్టీ హయాంలోనే : మంత్రి పెద్దిరెడ్డి
ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో 60 లక్షల దొంగ ఓట్లు నమోదయాయని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 3.90 కోట్ల ఓటర్లలో 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లుగా ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఓట్లు చేర్చారని వాటి మీద చర్యలు తీసుకుంటుంటే తమ ఓట్లు తొలగిస్తున్నారని చంద్రబాబు నాయుడు వితండవాదంతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఏదో ఒక రకంగా అడ్డుకొని 60 లక్షల దొంగ ఓట్లను కాపాడుకునే ప్రయత్నంలోనే తమ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దొంగ ఓట్లు గుర్తించింది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవటమే కాకుండా తమ పార్లమెంటు సభ్యులందరూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కేంద్రీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తారని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని ఎవరు పొత్తులు తమకు అవసరం లేదని ఇంతకు ముందే తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

