స్టార్ డైరెక్టర్ మూవీని రిజెక్ట్ చేసిన రెజీనా….!
తెలుగులో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా. ప్రస్తుతం అంతగా కనిపించడం లేదు . తాజాగా ఈ అమ్మడు నటించిన ఉత్సవం సినిమా సెప్టెంబర్ 13న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తిర విషయాన్ని మీడియా ముందు చెపింది ఈ అందాల భామ. తెలుగులో ఓకేసారి రెండు ఆఫర్స్ రావడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది. కాలేజీ లో ఉన్నపుడు సినిమా అంటే ఇష్టంతో , మూవీస్ లోకి వచ్చాను. కన్నడ, తమిళంలో రెండు సినిమాలు చేసిన తర్వాతా తెలుగులో ఆడిషన్స్ ఇచ్చాను. కానీ తెలుగులో ఒకేసారి రెండు సినిమాలకు సెలక్ట్ అయ్యాను. శివ మనసులో శృతి, శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీస్ కోసం సెలక్ట్ అయ్యాను. రెండు సినిమాలకు ఆడిషన్స్ పూర్తైన తర్వాత రెండు ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసారు . అయితే ఓకేసారి రెండు సినిమాలు చెయ్యాడం కష్టం కేవలం ఒక్క సినిమాకే డేట్స్ ఇవ్వాలి. కెరీర్ మొదట్లోనే రెండు సినిమాలకు ఛాన్స్ రావడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చింది. ఒకటి కావాలి అంటే ఇంకొకటి వదులుకోవాల్సిందే అంటూ చెప్పుకుంటూ వచ్చింది.

