మంత్రివర్గ సమావేశం ప్రారంభం
తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రగతిభవన్‌లో ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో అదనపు నిధుల సమీకరణపై చర్చిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అదనపు వనరులను ఏవిధంగా సమీకరించాలనే విషయంపై కేబినెట్ చర్చిస్తుంది. దీంతోపాటు వృద్ధాప్య పింఛన్ల వయసు 57 ఏళ్లకు తగ్గింపు, డయాలసిస్ పేషంట్లకు ఆసరా, అనాథ పిల్లల సంరక్షణ పాలసీ, స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ సత్ర్పవర్తన కలిగిన 75 మంది ఖైదీల రీలీజ్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణ, మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది