ఇక రేషన్ షాపుల ముందు పడిగాపులే..
ఏపీ ప్రజలకు రేషన్ కోసం పాత రోజులు రానున్నాయి. ఇంటి వద్దకే రేషన్ పద్దతికి స్వస్తి చెప్పి, ఇకపై రేషన్ షాపుల్లోనే రేషన్ ఇస్తామంటూ నిర్ణయించింది.. 65 ఏళ్ల వయసు దాటిన వృద్దులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి పంపుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎందుకంటే రేషన్ సరఫరా చేసే ఎండీయూ వాహనాలలో ఇప్పటి వరకూ 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులున్నాయని, దీనితో ఇళ్లకు సరఫరా నిలిపివేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రేషన్ ఇళ్లకు సరఫరా చేయడానికి ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతోందని ఎండీయూ వాహనాలను నిలిపివేశారు. అయితే ఈ వాహనాలతో అగ్రిమెంట్లు 2027 వరకూ ఉన్నాయని, అప్పుడే ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోతామని ఎండీయూ ఆపరేటర్స్ గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం మాకు ఉపాధి చూపించాలని, బ్యాంకుల నుండి ఎన్‌వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

