Home Page SliderNational

F-16 ఫైటర్ జెట్‌‌ ఎక్కే సాహసం చేసిన రతన్ టాటా

ఫిబ్రవరి 2007లో, రతన్ టాటా అత్యంత వేగవంతమైన సాహసయాత్ర చేశారు. బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో, 69 ఏళ్ల రతన్ టాటాను US డిఫెన్స్ కాంట్రాక్టర్ లాక్‌హీడ్ మార్టిన్‌తో కలిసి F-16 ఫైటర్‌ జెట్‌‌లో ప్రయాణించారు. యుద్ధ విమానాన్ని కో-పైలట్‌గా నడిపించేందుకు ప్రయత్నించారు. లాక్‌హీడ్ మార్టిన్ పైలట్ మార్గదర్శకత్వంలో ప్రయాణించి తన జీవితంలో ఉల్లాసభరితమైన క్షణాలను ఆస్వాదించారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత టాటా తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. F-16 తర్వాత మరుసటి రోజే, రతన్ టాటా మరోసారి ఫైటర్ విమానంలో ప్రయాణించాడు. ఆ తర్వాత బోయింగ్ F-18 సూపర్ హార్నెట్‌లో ఆయన ప్రయాణించారు. అది F-16 కంటే పెద్దది, శక్తివంతమైనది. చాలా కాలంగా విమానయానం పట్ల మక్కువతో ఉన్న టాటాకు, ప్రపంచంలోని రెండు అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఎగురే కల నిజమైంది.