Home Page SliderNational

“కుబేర” సినిమాలో రష్మిక ఫస్ట్ లుక్ విడుదల

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్,టాలీవుడ్ హీరో నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “కుబేర”.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు రష్మికకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే  సునీల్ నారంగ్,పి.రామ్మెహన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా రష్మిక పుష్ప-2 సినిమాలో కూడా హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే.