Home Page SlidermoviesTelanganatelangana,viral

దర్శకుడికి రామ్‌చరణ్ స్పెషల్ సర్‌ప్రైజ్..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కొత్త చిత్రానికి దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ నవమి పండుగ రాబోతున్న సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు రామ్‌చరణ్‌ దంపతులు ప్రత్యేక బహుమతి పంపారు. ఈ బహుమతి తనకెంతో ప్రత్యేకమని బుచ్చిబాబు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ఇటీవల రామ్‌చరణ్‌ 40వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్‌ దంపతులు హనుమాన్‌ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను గిఫ్ట్‌గా పంపారు. ‘నా మనసులో నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని రాసి ఉన్న నోట్‌ కూడా ఉంది. వాటితో పాటు శ్రీరాముని పాదుకలను కూడా పంపారు. ఆ ఫొటోలను పంచుకున్న బుచ్చిబాబు ఈ బహుమతి మీ ప్రేమను తెలియజేస్తుందంటూ రామ్ చరణ్‌, ఉపాసనను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌పెట్టారు. ఈ అమూల్యమైన బహుమతినిచ్చినందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు.