Breaking NewsHome Page Slider

తండ్రి కాబోతున్న రాంచరణ్‌

రాంచరణ్‌, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. రాంచరణ్‌, ఉపాసన దంపతులు త్వరలోనే ఫస్ట్‌ చైల్డ్‌ను ఆహ్వానించనున్నారని తెలిపారు. శ్రీ హనుమాన్‌ జీ ఆశీస్సులతో… రాంచరణ్‌, ఉపాసన దంపతులు పేరెంట్స్‌ కాబోతున్నారనే విషయాన్ని మీతో పంచుకునేందుకు సంతోషిస్తున్నాను` అంటూ హనుమంతుడి ఫోటోతో కూడిన పోస్ట్‌ షేర్‌ చేసిన చిరంజీవి… చివరన ప్రేమతో.. సురేఖ, చిరంజీవి కొణిదెలతోపాటు శోభ, అనిల్‌ కామినేని అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త తెలిసిన మెగా ఫ్యాన్స్‌ స్పెషల్‌ విషెస్‌తో కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రాంచరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో #RC15 చేస్తున్నాడు. ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాతగా ఉన్నారు. దాదాపు షూటింగ్‌ పూర్తయ్యింది. ఇక మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన.. అపోలో హాస్పిటల్స్‌ బాధ్యతలతోపాటు పలు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. ప్రస్తుతం అపోలో చారిటీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తోంది.