Home Page SliderNational

రాఖీ సావంత్ భర్త ఆదిల్ దురానీ అరెస్ట్

రియాలిటీ స్టార్ రాఖీ సావంత్ భర్త ఆదిల్ దుర్రానీ తన నిధులను దుర్వినియోగం చేశాడని ఆరోపిస్తూ అతనిపై ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అరెస్టుచేశారు. ఆదిల్ దురానీపై ఓషివారా పోలీసులు ఐపీసీ సెక్షన్ 406, 420 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాయంత్రం తర్వాత, పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఐపిసి 498 (ఎ), 377 సెక్షన్‌లను కూడా జోడించారు. తనపై దాడి చేసి తనకు తెలియకుండా తన ఫ్లాట్‌లోని డబ్బు, నగలను ఎత్తుకెళ్లాడని రాఖీ సావంత్ ఆరోపించింది. ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, రాఖీ ఇలా పేర్కొంది ” ఆదిల్ ఉదయం నన్ను కొట్టడానికి వచ్చాడు, నేను వెంటనే పోలీసులకు కాల్ చేసాను. తరచూ నన్ను బెదిరిస్తున్నాడు. ఈ రోజు కూడా నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను భయపడ్డాను, మీడియాలో తన పరువు తీశానని ఆరోపించాడు”.

గత నెలలో ఆదిల్‌ను వివాహం చేసుకున్నట్లు రాఖీ సావంత్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఆమె వివాహం మే 29, 2022న జరిగినట్లు చూపుతున్న వారి వివాహ ధృవీకరణ పత్రం ఫోటోను షేర్ చేసింది. ఐతే ఆదిల్‌కు వివాహేతర సంబంధం ఉందని రాఖీ ఆరోపించింది. రాఖీ సోదరుడు రాకేష్ కూడా నటికి మద్దతుగా నిలిచాడు. ఆదిల్ తనను శారీరకంగా గాయపర్చడంతోపాటు, దుర్భాషలాడాడన్నాడు. “ఇంత స్థాయికి దిగజారిపోతాడని ఎప్పుడూ అనుకోలేదు.. రెండు మూడు సార్లు క్షమించాం.. మా అమ్మ చనిపోయిన మరుసటి రోజు రాఖీ కట్టడానికి ఇంటికి వెళ్లినప్పుడు రాఖీ మొహం వాచిపోయి ఉండడం గమనించాం. ఏడుస్తూ ఉంది, మా బంధువులు ఆమెను అడగగా, మా అమ్మ చనిపోయిన రోజునే ఆదిల్ తనను కొట్టాడని ఆమె వెల్లడించింది” అని రాఖీ సోదరుడు చెప్పాడు. రాఖీ సావంత్, ఆదిల్‌ల వివాదానికి సంబంధించిన వివరాలు రాఖీ తల్లి మరణించిన కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటిగా వస్తున్నాయి.