చిగురుపాటి జయరామ్ హత్య కేసులో రాకేష్ రెడ్డికి యావజ్జీవ ఖైదు
ఇండస్ట్రియలిస్ట్ చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందుతుడు రాకేష్ రెడ్డికి కోర్టు జీవిత ఖైదు విధించింది. నాలుగేళ్ల విచారణ అనంతరం నాంపల్లి మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తీర్పు వెల్లడించింది. హత్య కేసులో నాంపల్లి పోలీసులు 23 పేజీల ఛార్జ్‌షీట్ రూపొందించారు. కేసులో మొత్తం 70 మందికి పైగా సాక్ష్యులను కోర్టు విచారించింది. 11 మందిని నిర్దోషులని ప్రకటించింది. హనీట్రాప్ ద్వారా జయరామ్ హత్యకు కుట్ర పన్నినట్టుగా పోలీసులు పక్కా ఆధారాలను న్యాయస్థానం ముందు ఉంచారు. 2019 జనవరి 31న కృష్ణా జిల్లా నందిగామ ఐతవరం కారులో చిగురుపాటి జయరామ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మొదట కిడ్నాప్ చేసిన రాకేష్ రెడ్డి ఆ తర్వాత హత్యకు తెగబడ్డాడు.

