Home Page SliderTelangana

దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర

వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ నేవీ రాడర్ స్టేషన్ కు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కేంద్రమంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. నేవీ రాడార్ కు సంబంధించి దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు దేశ భద్రత వేరని.. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. దామగుండంలో నిర్మించనున్న నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి కృషి అభినందనీయమని కొనియాడారు. రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్ కు మంచి పేరు ఉందని.. దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారిందని అన్నారు.