NewsTelangana

కేసీఆర్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్

Share with

లాండ్ పూలింగ్ పేరుతో అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు గుంజుకుంటున్నారని విమర్శించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ . రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ లా తయారైందన్నారు. అసైన్డ్ భూముల విషయంలో దళితులకు బీజేపీ అండగా ఉంటుందని… రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ అంపశయ్య మీద పడుకోబెట్టారన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ఆదివాసీ, గిరిజన, హరిజన రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. ఆదివాసీ మహిళను బీజేపీ భారత రాష్ట్రపతిగా అవకాశం కల్పిస్తే… కేసీఆర్ సర్కార్ గిరిజన మహిళలపై దాడులకు పాల్పడుతుందని ఈటల విమర్శించారు. అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఈటల డిమాండ్ చేశారు. మేనిఫెస్టో భగవద్గీత లాంటిదని చెప్పిన కేసీఆర్.. అమలు మాత్రం మరిచారన్నారు. గిరిజన మహిళలపై అటవీశాఖ అధికారులు దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. గిరిజనుల పట్ల ప్రభుత్వ తీరు అసహ్యంచుకునేలా ఉందన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో ప్రభుత్వం ఒక ఎకరం అసైన్డ్ భూమి పంచలేదని… దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చీట్ చేశారని ఈటల ఆక్షేపించారు. కేసీఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కన్నీరు పెడుతున్నారన్నారు.