మునుగోడు ఎన్నికల ప్రచారంలో రాజగోపాల్‌రెడ్డి సతీమణి
మునుగోడులో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మునుగోడులో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మునుగోడు నియోజక వర్గంలో నేతలు వరుస ప్రచారాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులను కూడా ప్రచారంలోకి దింపుతున్నారు. ఈ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మీ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ రోజు ఆమె చౌటుప్పల్‌లో ఇంటింటికి ప్రచారం చేశారు. అందరూ కూడా ఈ ఉపఎన్నికలలో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్, రాజగోపాల్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. అయినప్పటికీ మునుగోడు ప్రజలంతా రాజగోపాల్‌రెడ్డి వైపే ఉన్నారని ఆమె తెలిపారు.

