రాజాసింగ్ ఝలక్.. మంత్రి తలసానిపై ఎమ్మెల్యే ప్రశంసలు
వివాదస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన రూటు మార్చారు. ప్రతిసారి అధికార పార్టీపై విమర్శలు చేసే రాజాసింగ్ ఈసారి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించారు. తలసాని చాలా బాగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో నిర్మించిన 120 డబుల్ బెడ్‌రూం ఇళ్ళను ఈ రోజు తలసాని, హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా హాజరయ్యారు. ముగ్గురు కలిసి రిబ్బన్ కట్ చేసి లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కొంత ఆలస్యం అయినా డబుల్ బెడ్‌రూం ఇళ్ళు ఇచ్చారన్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. మిగిలిన కొంత మంది కూడా ఇళ్లు అడుగుతున్నారని వారికి కూడా ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.

