సోదరితో రాహుల్ సరదా ఆటలు… వీడియో వైరల్
భారత్ జోడో యాత్ర ముగింపు సభ కోసం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలు సోమవారం జమ్ముకాశ్మీర్‌కు చేరుకున్నారు. సభకు బయలు దేరి వెళ్లడానికి ముందు పార్టీ ఆఫీసులో ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఆఫీసు ఆవరణలో పేరుకుపోయిన మంచును చూసి వారు ఇద్దరూ కాసేపు సరదాగా ఆటలు ఆడుకున్నారు. ఒకరిపై మరొకరు మంచు విసురుకుంటూ ఎంజాయ్ చేశారు. అనంతరం శ్రీనగర్‌లోని స్టేడియంలో నిర్వహిస్తున్న సభకు నేతలందరూ కలిసి వెళ్లారు. ఈ మంచులో రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి ఆటలాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.