NationalNews

రాహుల్‌ గాంధీ భావోద్వేగ ట్వీట్‌

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా… ఢిల్లీలోని వీర్‌ భూమిలో ఉన్న రాజీవ్‌ గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. పార్టీ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే, ఎంపీ కేసీ వేణుగోపాల్‌, రాబర్ట్‌ వాద్రా తదితరులు మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. రాజీవ్‌ గాంధీ సతీమణి సోనియా గాంధీకి కరోనా సోకడంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అయితే… రాజీవ్‌గాంధీ జయంతి రోజున ప్రతి ఏటా సద్భావన దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది.

రాజీవ్‌ గాంధీ 78వ జయంతి సందర్భంగా రాహుల్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. “నువ్వు నా గుండెల్లో ప్రతి క్షణం ఉంటావు. దేశం కోసం మీరు కన్న కలను నెరవేర్చడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను’’ అని ట్వీట్‌ చేశారు.

మరో వైపు.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించారు.