పీవీకి భారతరత్న తెలంగాణకు గర్వకారణం-సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఆర్ధిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు. పీవీ నరసింహారావుకి భారత రత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆలస్యమైనా వారికి ఈ గౌరవం దక్కడం గర్వకారణమన్నారు. తన తరపున, సభ తరపున, తెలంగాణ ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇది మనందరికీ గర్వకారణమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

