ఓటీటీలో రికార్డు బద్దలు కొట్టిన ‘పుష్ప- 2’
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం 2 వేల కోట్ల రూపాయల వసూళ్లతో థియేటర్స్‌లో సంచలనం సృష్టించింది. అంతేకాదు, ఇప్పుడు ఓటీటీలో కూడా ‘పుష్ప 2’ చిత్రం దుమ్ము దులిపేస్తోంది. తాజాగా ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఓటీటీలోకి వచ్చిన నాటి నుండి టాప్‌లో దూసుకుపోతోంది. ఏకంగా ఏడు దేశాలలో నంబర్ వన్ స్థానంలో ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ చిత్రాలలో కాకుండా ఇతర భాషా చిత్రాలలో రెండవ స్థానంలో నిలిచింది. 5.8 మిలియన్ల వ్యూస్ సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది. ప్రత్యేకించి ఈ చిత్రంలో జాతర ఎపిసోడ్ విదేశీయులను బాగా ఆకర్షిస్తోంది. అల్లు అర్జున్ చీరకట్టులో చేసిన డ్యాన్స్, ఫైట్స్ వారిని మెస్మరైజ్ చేస్తున్నాయి. అలాగే జపాన్‌లో తీసిన ఎపిసోడ్‌లో పుష్ప ఎత్తైన ప్లేస్ నుండి దూకడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. జపాన్ యుద్ధ విద్యలేమైనా నేర్చుకున్నారా? అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇవన్నీ గ్రాఫిక్సే కదా? అంటూ క్లారిటీ అడుగుతున్నారు.

