National

అన్ని వర్గాలకు కీలక పదవులు… ఇదే బీజేపీ రాజకీయనీతి

Share with

రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం నలుగురు దక్షిణాది ప్రముఖులను రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేసింది. రాష్ట్రపతి పదవిలో ఒక దళిత మహిళకు, ఉప రాష్ట్రపతి ఒక మైనార్టీ ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తికి… ఇలా అన్ని వర్గాలను కలుపుకుంటూ వెళ్తున్న బీజేపీ… తాజాగా ప్రకటించిన రాజ్యసభలో దక్షిణాదికి అగ్రతాంబూలం అందించింది. సంగీత దిగ్గజం ఇళయ రాజా, ప్రముఖ సినీ కథా రచయిత విజయేంద్రప్రసాద్, పరుగుల రాణి పీ.టీ. ఉష, ఆధ్యాత్మిక , సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉందన్నారు మోదీ. విజయేంద్రప్రసాద్ బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సినిమాలకు కథను అందించారని భారతీయ సంస్కతిని ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రముఖ క్రీడాకారిణి పీటీ ఉష జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగిస్తోంది. వీరేంద్రహెగ్డే గొప్ప సమాజసేవకుడని, ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక రంగంలో చాన్నాళ్లుగా సేవలందిస్తున్నరాు. ఇలాంటి వ్యక్తులు పార్లమెంట్ కార్యక్రమాలు పాల్గొనడం వల్ల ఎంతో ఫలవంతంగా చర్చలు జరుగుతాయని… ప్రముఖులు రాజ్యసభకు నామినేట్ కావడం చాలా సంతోషంగా ఉందని మోదీ ట్వీట్ చేసారు. దీంతో బీజేపి ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందన్న వాదనకు అడ్డుకట్ట వేసినట్లయింది.