సొంతపార్టీపై నిరసనలు..
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై ముస్లిం నేతలు భగ్గుమంటున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ ముస్లిం నేతలు ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులను కావాలనే పక్కనపెట్టిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 14% ముస్లిం జనాభా ఉన్నా.. ఒక్క ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదని మైనారిటీ నేతలు మండిపడ్డారు. నిరసన తెలియజేస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరికి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కి, మరికొందరికి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.


 
							 
							