Home Page SliderNational

ఒకే వేదికపై ప్రియాంక, సమంత..

హీరోయిన్ సమంత, ప్రియాంక చోప్రా ఒకేచోట కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అయ్యాయి. స‌మంత ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న స్పై యాక్షన్‌ సిరీస్‌  సిటాడెల్‌: హనీ బన్నీ. ఇందులో వరుణ్‌ ధావన్ క‌థానాయకుడిగా న‌టిస్తుండ‌గా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే ఈ వెబ్ సిరీస్‌కు డైరెక్షన్ చేస్తున్నారు. ప్రియాంక చోప్రా న‌టించిన‌ హాలీవుడ్ బ్లాక్ బ‌స్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్‌’కు రీమేక్‌గా ఈ సిరీస్ ఉండబోతోంది. తాజాగా లండన్‌లో దీని ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సమంతతో పాటు ప్రియాంక చోప్రో కూడా హాజరయ్యారు. ప్రియాంక చోప్రా రెడ్‌ డ్రెస్‌లో ఉండగా.. సమంత బ్లాక్‌ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించారు.

సిటాడెల్‌: హనీ బన్నీ సిరీస్‌ను నవంబర్‌ 7వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌లో పెట్టనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రక‌టించింది. కె కె మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్, కష్వీ మజ్ముందర్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్రలు పోషించారు.