సోషల్ పోస్టులు పెడితే అరెస్టులా…
జగన్ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని సీఐడీ టార్గెట్ చేస్తోందని ఆయన విమర్శించారు. వేధింపులను ఆపాలని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు. గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకొని సీఐడీ వేధించిందని చంద్రబాబు పేర్కొన్నారు. నోటీసుల పేరుతో అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. సుప్రీం తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు.