Home Page SliderNational

రైలు ప్రమాద స్థలాన్ని పరామర్శించిన ప్రధాని మోదీ

దేశ ప్రధాని మోదీ ఒడిశాలో ప్రమాదం జరిగిన బాలేశ్వర్ జిల్లాలోని బాలాసోర్‌కు చేరుకున్నారు.  అక్కడ రైలు ప్రమాద స్థలాన్ని మోదీ పరిశీలించారు. అనంతరం ప్రమాదంపై వివరాలను మోదీ  అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదంపై రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రాథమిక రిపోర్టును కేంద్ర మంత్రులు మోదీకి వివరించారు. కాగా మోదీ మరికొంత సేపట్లో ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు సమాచారం.