కేసీఆర్కు గాయం.. త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రధాని మోడీ
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మోడీ ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా రికవర్ అవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.

