Home Page SliderInternational

‘ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్-అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్’ అంటూ బైడెన్ తికమక

నేడు జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తడబడి, పేర్లు తికమకగా చెప్పడం చర్చనీయాంశమయ్యింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్-అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్ అంటూ బైడెన్ తికమక పడ్డారు. తన సొంత పార్టీలోనే బైడెన్‌ను అధ్యక్ష రేసు నుండి వైదొలగాలని డిమాండ్లు వస్తుండడంతో ఆయన విలేకరుల సమావేశానికి హాజరై తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాలనుకున్నారు. ఆయన మానసిక స్థితిపై సొంత డెమోక్రట్లే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం అంటూ ఆయన సవాల్ చేస్తున్నారు. తన న్యూరోలాజికల్ సామర్థ్యం బాగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు నాటో కూటమి సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పరిచయం చేశారు. ఆయనను ఆహ్వానిస్తూ అధ్యక్షుడు పుతిన్ అని సంబోధించారు. జెలెన్‌స్కీ ఈ విషయాన్ని నవ్వుతూ తీసుకున్నారు. సమావేశంలో మాట్లాడుతూ తన ఉపాధ్యక్షుడు ట్రంప్‌కు అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలున్నాయని అన్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బదులుగా ఆయన ట్రంప్ పేరు చెప్పడంతో అందరూ బిత్తర పోయారు.