ప్రశాంత్ కిషోర్‌ను లెక్కలోకి తీసుకోనక్కర్లేదు: పీకే జోస్యంపై జగన్ సైటర్లు
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలను పట్టించుకోనక్కర్లేదన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీలోని 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఒక రోజు ముందు మే 12న, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీకి భారీ ఓటమిని అంచనా వేశారు. ఓ తెలుగు టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ 51 సీట్లు మాత్రమే గెలుస్తుందని ఆయన చెప్పారు. అధికార పార్టీకి ఎన్నికల ప్రచారం, రాజకీయ సేవలు అందించిన తన పొలిటికల్ కన్సల్టెన్సీ టీమ్, ఐ-ప్యాక్‌ని ఉద్దేశించి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. గతం కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టిస్తుందని, ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని, జూన్ 4న వచ్చే ఫలితాలు యావత్ దేశం ఏపీ ఫలితాలను చూస్తోందని చెప్పారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న వైసీపీ పనితీరును గుర్తుచేసుకున్న సీఎం, ఈ ఏడాది ఎన్నికల్లో ఆ పార్టీ మరింత మెరుగ్గా పనిచేస్తుందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. “చాలా సంఘర్షణ జరుగుతోంది. అది మీకందరికీ తెలుసు. అంతకుముందు ప్రశాంత్ కిషోర్ వచ్చి మా పని అయిపోయిందని చెప్పాడు. ఇది ఇయన డబుల్ స్టాండర్ట్స్‌కు నిదర్శనం. ఈ టీమ్‌కి, ప్రశాంత్ ఏం చేస్తున్నాడో చాలా మందికి అర్థం కాలేదు.” అని జగన్ చెప్పారు.


