Home Page SliderNational

ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సంచలన వ్యాఖ్యలు

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదన్నారు శర్మిష్ఠ. రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో.. సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని ఓ నేత చెప్పారు.. కానీ కేఆర్ నారాయణన్ మృతి సమయంలో సీడబ్ల్యూసీ సమావేశాల్లో సంతాపం తెలిపారు.. అప్పటి సంతాప సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీ రాశారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నన్ను తప్పుదోవ పట్టించిందని శర్మిష్ఠ ముఖర్జీ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.