Home Page SliderNational

నేషనల్ అవార్డ్స్‌పై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

 విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తాజాగా కేంద్రం ప్రకటించిన నేషనల్ అవార్డ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా ఈసారి టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కి భారీ విజయం సాధించిన “జై భీమ్” సినిమాకు ఒక్క నేషనల్ అవార్డ్ కూడా రాలేదు. దీనిపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మన మహత్ముని హత్యను సమర్థించేవారు..బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకునేవారు. జై భీమ్ సినిమాకు అవార్డు ఇస్తారా?అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.అయితే ఈ మధ్య కాలంలో మణిపూర్‌లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటనపై కూడా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రకాష్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి.