Home Page SliderNationalTrending Today

కమల్‌హాసన్ పై ప్రభాస్ కామెంట్స్…ఇంతకీ ఏమన్నాడంటే!…

ప్రభాస్ నటించిన కల్కి 2898-A.D. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించారు. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, దిశా పఠాని, బ్రహ్మానందం, శోభన, రాజేంద్ర ప్రసాద్ నటించగా, గెస్ట్ రోల్‌లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, మాళవిక నాయర్ తదితరులు మెరిసారు. బుజ్జి అనబడే కార్‌కి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పారు. ఇక ఇందులో ‘సుప్రీమ్ యాస్కిన్’ పాత్ర పోషించిన కమలహాసన్ గురించైతే చెప్పనవసరం లేదు. ఆయన ఎప్పుడూ కూడా చాలా వైవిద్యమైన పాత్రలు పోషిస్తుంటారు. ఆయన క్యారెక్టర్ కల్కి పార్ట్ 1 లో తక్కువగా ఉన్నా ఆయన కనిపించినంత వరకూ ఇరగదీసారు. కాగా కమలహాసన్ ‘కేహెచ్’, ‘హౌజ్ ఆఫ్ ఖద్దర్’ అనే బ్రాండ్స్‌తో ఖాదీ దుస్తుల వ్యాపారం మొదలు పెట్టారు. ఇటీవలే న్యూయార్క్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో ‘సుటూర’ అనే సరికొత్త కలెక్షన్‌ను ప్రదర్శించారు. అయితే ఈ కలెక్షన్‌ను ఆయన తనతోపాటు కల్కి 2898-A.D లో కలిసి నటించిన ప్రభాస్‌కు కానుకగా పంపారు. “ప్రేమతో ఈ గిఫ్ట్ పంపించినందుకు కృతజ్ఞతలు కమల్ సర్. మీ కొత్త కలెక్షన్‌కు ఆల్ ది బెస్ట్” అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు.