Home Page SliderTelangana

బీజేపీకి అధికారం.. కేసీఆర్‌కి విశ్రాంతి-జేపీ నడ్డా

కేసీఆర్‌కు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. కేసీఆర్ సర్కారు అవినీతిలో మునిగిపోయిందన్నారు. బీజేపీకి అధికారం.. కేసీఆర్‌కి విశ్రాంతి అవసరమన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ అయ్యిందని.. త్వరలో వీఆర్ఎస్ తప్పదన్నారు. ఒకప్పుడు ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు అప్పులపాలయ్యిందన్నారు జేపీ నడ్డా. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ప్రజల స్పందన చూస్తే తెలంగాణలో అధికారం ఖాయమనిస్తోందన్నారు. దళిత, గిరిజన వర్గాలకు మోదీ పెద్ద పీట వస్తున్నారన్నారు. ఆదివాసీని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదన్నారు. మోదీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. తెలంగాణలో కేంద్ర నిధులతో 5 వేల కిలో మీటర్ల రోడ్లు వేశామన్నారు. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఉందన్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ 5 విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు.