Home Page SliderNationalNews Alert

సీఎం జగన్‌ ట్వీట్‌పై ప్రముఖ సింగర్‌ ఆగ్రహం

నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌పై ప్రముఖ సింగర్‌ అద్నాన్‌ సమీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జెండా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతోందన్నారు. యావత్‌ రాష్ట్రం తరఫున.. కీరవాణి, రాజమౌళి, జూ. ఎన్టీఆర్‌, రాంచరణ్‌తోపాటు ట్రిబుల్‌ ఆర్‌ టీంకు అభినందనలు తెలియజేస్తునన్నారు. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నామంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. అయితే.. జగన్‌ ట్వీట్‌పై అద్నాన్‌ సమీ మండిపడ్డారు..  ముందుగా మనం భారతీయులం. వేర్పాటువాద వైఖరి మంచిది కాదంటూ జగన్‌ ట్వీట్‌కు అద్నాన్‌ సమీ రిప్లై ఇచ్చారు. “తెలుగు జెండానా.. భారత జెండా కదా? ముందుగా మనం భారతీయులం, కాబట్టి దయచేసి దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి మిమ్మల్ని వేరు చేయడం ఆపండి… ముఖ్యంగా అంతర్జాతీయంగా మనది ఒకే దేశం.. 1947లో మనం చూసినట్లుగా ఈ ‘వేర్పాటువాద’ వైఖరి చాలా మంచిది కాదు. ధన్యవాదాలు.. జై హింద్‌! అంటూ అద్నాన్‌ సమీ ట్వీట్‌ చేశాడు.