News Alert

పెళ్లైందా అంటూ? వచ్చిన వార్తలపై స్పందించిన హీరోయిన్

మీకు పెళ్లైందా అంటూ వచ్చిన వార్తల పై స్పందించారు పూనమ్ కౌర్. ఈ వార్తలు రాజకీయంగా ప్రేరేపించబడ్డాయో లేక మిషనరీల ఆలోచనా విధానాల నుండి వచ్చాయో తెలీదు. కర్వాచౌత్‌ను కాబోయే భర్తల కోసం పెళ్లికాని అమ్మాయిలు కూడా జరుపుకుంటారు. పెళ్లైన వారు చంద్రుడిని ఆరాధిస్తే పెళ్లికాని వారు చుక్కలను ఆరాధిస్తారు” అని ట్వీట్ చేశారు. కాగా పెళ్లైన మహిళలు తమ భర్త ఆరోగ్యంగా వందేళ్లు జీవించాలని ఉపవాసం చేసి సాయంత్రం సమాయానికి జల్లేడలో ముందుగా చందమామను చూసిన వెంటనే వారి భర్త ముఖాలను చూసి ఉపవాసాన్ని ముగిస్తారు. కర్వాచౌత్ రోజు పూనమ్ కూడా జల్లెడ పట్టుకొని సిగ్గుపడుతూ ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనిని చూసిన వారంతా పూనమ్ నీకు పెళ్లైందా అంటూ చేసిన కామెంట్ల చేశారు. దీంతో వాటికి ఆమె బదులిచ్చారు.