Telangana

లైన్‌మెన్ ఉద్యోగల పరీక్షలో గోల్‌మాల్

Share with

తెలంగాణ విద్యుత్ శాఖ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(టీఎస్ఎస్‌పీడీసీఎల్)లో జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగల కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మాస్ కాపీయింగ్‌కి పాల్పడిన పలువురు అభ్యర్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవ్య అనే యువతి అభ్యర్ధులకు సమాధానాలు చేరవేసినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఘట్‌కేసర్,సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నవ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు టీఎస్ఎస్‌పీడీసీఎల్ 1000 లైన్‌మెన్ ఉద్యోగాలకు ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నెల 17 వ తేదిన పరీక్ష జరిగింది. ఫలితాల కోసం అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాస్ కాపీయింగ్ వ్యవహరం వెలుగులోనికి రావడం అభ్యర్ధులను కలవరపెడుతోంది. ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన అభ్యర్ధులు మాస్ కాపీయింగ్ గురించి తెలిసి ఆందోళన చెందుతున్నారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది