ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలి : పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని మరోసారి ముఖ్యమంత్రి జగన్ను భరించలేమని వైఎస్ఆర్సీపీ, తప్ప ఎవరు అధికారంలోకి వచ్చిన పర్వాలేదని జనసేనాని పవన్ కల్యాన్ అన్నారు. అధికార పక్షం చూపే ప్రలోభాలకు, డబ్బుకు లొంగిపోవద్దని ప్రజలను కోరారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరో ఆరు నెలల పాటు భరించాల్సిందేనని జగన్‌ను దేవుడు అనుకొని మొక్కామని దెయ్యమై జనాన్ని పట్టుకొని పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. ఆ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాకూడదని పిలుపునిచ్చారు.

జనసేన ప్రభుత్వం లేదా మిశ్రమ ప్రభుత్వం ఏర్పడిన నష్టం లేదన్నారు. తాను ముఖ్యమంత్రి స్థానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అయితే తాను కోరుకున్నంత మాత్రాన కాలేనని ప్రజల ఆశీర్వాదం ముఖ్యమన్నారు. ప్రజల గుండెల్లో స్థానం ఎంపీ ,ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కంటే ఎంతో గొప్పది అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం గాజువాకలో నిర్వహించిన సభకు భారీగా జనం తరలివచ్చారు. ప్రధాన రహదారి పొడవునా జనసేన అధినేతకు జనం బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలు రాజకీయాలు భూ దందాలకు సంబంధించి అంశాల వారీగా విపులంగా మాట్లాడారు.

