Andhra PradeshNews

ప్రజలు మనిషిగా గవర్నర్ బిశ్వ భూషణ్‌కు మన్ననలు

Share with

సాధారణ జీవితం ఆయన నైజం
ఆరు దశాబ్దాలుగా మచ్చలేని రాజకీయ జీవితం
ఏపీలో గవర్నర్ గా నేటికీ మూడేళ్ల పదవీకాలం పూర్తి

రాష్ట్ర ప్రథమ పౌరునిగా సాధారణ జీవితాన్ని గడిపేందుకు గవర్నర్ బిశ్వ భూషణ్ ఇష్టపడతారు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణం సైతం వద్దంటూ సాధారణ ప్రయాణికుడిగానే తన రాకపోకలను సాగించటానికి ఇష్టపడే మహోన్నత వ్యక్తి ఏపీ గవర్నర్. ప్రోటోకాల్ కూడా పక్కనపెట్టి సగటు మనుషులతో కలిసేందుకు… వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. రెడ్ కార్పెట్ స్వాగతం సైతం ఇష్టపడని గవర్నర్ ఆంధ్రప్రదేశ్లో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి నేటికీ మూడు ఏళ్లు పూర్తయ్యింది.

ఒడిశాలోని ఖుర్దాకు చెందిన బిశ్వ భూషణ్ హరి చందన్ 1934 ఆగస్టు 3న జన్మించారు. అయనికి జనసంఘ్ తో దశాబ్దాల అనుబంధం ఉంది. ఒడిశాలో ‘సంఘ్‌’ కార్యకలాపాలు విస్తరించేందుకు అయన 1964లో అక్కడ భారతీయ జనసంఘ్‌ శాఖను ఏర్పరిచారు. ఇప్పటిదాకా రెండుసార్లు జనతా పార్టీ టికెట్‌పై, మూడుసార్లు భారతీయ జనతా పార్టీ తరఫున మొత్తం ఐదుసార్లు ఆయన శాసనసభ్యునిగా గెలిచారు. రెవెన్యూ, న్యాయ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1980 నుంచి ఎనిమిదేళ్లపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు.

ఆంధ్రప్రదేశ్లో విభిన్న అంశాల్లో ఆయన తనదైన ముద్రను ఈ మూడు సంవత్సరాల కాలంలో బలంగా చూపించగలిగారు. ఒక రాజకీయ నాయకుడు కవి నాటక రచయిత న్యాయవాది పోరాట యోధుడు శాసనసభ్యులు మొదలు… గవర్నర్ వరకు ఇలా ఏ విషయంలోనైనా హరిచందన్ గురించి మాట్లాడుకోవటానికి కొన్ని పేజీలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఆరు దశాబ్దాలుగా మచ్చలేని రాజకీయ జీవితం గడిపి విపక్షాల సైతం నమస్కరించే సమన్నతమైన వ్యక్తిత్వం ఆయనది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనిషిగా ఎన్నోసార్లు ప్రజల నుంచి మన్ననలు పొందారు. హరిచందన్ వయస్సు 88 సంవత్సరాలు ఉన్నా కూడా ఈ వయస్సులో నిజంగా ఎంతో ఉత్సాహంగా శక్తివంతంగా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

నడక యోగ తన ఫిట్నెస్ ను జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. కరోనా గరిష్ట స్థాయిలో చేరుకున్న సమయంలో కూడా తనని కలవటానికి రాజ్ భవన్‌కి వచ్చే అధికార, అనధికార వ్యక్తులతో ఎప్పుడు కలిసి మాట్లాడేవారు. పేద ప్రజలు సమాజంలోని అణగారిన వర్గాల పట్ల సానుభూతితో వ్యవహరించడం కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం చేయటం ఆయన నైజం. వివిధ క్రీడా పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులతో భేటీకావడం హరిచందనకు ఎంత ఇష్టమైన చర్య. మరికొన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కు ఆయన సేవలు ఎంతో అవసరమని ప్రజలు భావిస్తున్నారు. ఆయనకు సకల ఆయురారోగ్యాలు ఆ దేవుడు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.